ఆటో ప్రయాణికులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా నిందితురాలి అరెస్ట్,



 ఆటో ప్రయాణికులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా నిందితురాలి అరెస్ట్,

 రెండున్నర తులాల బంగారు సూత్రాలతో కూడిన పుస్తెలత్రాడు, రూ.14,000 నగదు స్వాదినం.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి టౌన్, జూన్ :27 అనకాపల్లి పట్టణంలో ఆటోల్లో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్జిల్లా మహిళా దొంగను అనకాపల్లి టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితురాలి నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు వెల్లడించారు.  

అనుమానాస్పదంగా తిరుగుతూ దొరికిన నిందితురాలు:

​శనివారం (27-06-2026) అనకాపల్లి పట్టణం, శంకరం రైల్వే బ్రిడ్జి సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో సబ్బవరం నుండి అనకాపల్లికి ఆటోలో వస్తున్న ఓ మహిళ పోలీసులను చూసి కంగారుపడి, ఆటో దిగి నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, పలు దొంగతనాల ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి.  

నిందితురాలి వివరాలు: గంట మీనా,భర్త: ఏలేసు, వయస్సు: 32 సంవత్సరాలు, నివాసం: 202 కాలనీ, కొత్తవలస గ్రామం, విజయనగరం జిల్లా.  

నిందితురాలు అంగీకరించిన నేరాలు​పోలీసుల విచారణలో నిందితురాలు అనకాపల్లి పట్టణంలో జరిగిన రెండు ప్రధాన దొంగతనాలలో తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించింది:  

​తేదీ. 11-06-2026న భీమునిగుమ్మం ప్రాంతంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరి సంచిని బ్లేడ్‌తో కోసి, అందులో ఉన్న రూ.20,000/- నగదును దొంగిలించింది.  

​తేదీ. 17-06-2026న రైల్వే స్టేషన్ అండర్ బ్రిడ్జి వద్ద ఆటో ఎక్కిన వృద్ధురాలిని అనుసరిస్తూ, గాంధీనగర్ మోర్ షాపు సమీపంలో ఆమె మెడలో ఉన్న సుమారు రెండున్నర తులాల బంగారు సూత్రాల తాడును అపహరించింది.  

స్వాధీనం చేసుకున్న సొత్తు 

​నిందితురాలి నుంచి క్రింది సొత్తును పోలీసులు రికవరీ చేశారు:  

​సుమారు రెండున్నర తులాల బంగారు సూత్రాలతో కూడిన పుస్తెల తాడు.  

​రూ.14,000/- నగదు.  

పోలీస్ సిబ్బందికి అభినందనలు 

​అనకాపల్లి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో, ఈ అరెస్టు మరియు సొత్తు రికవరీని సమర్థవంతంగా పూర్తి చేసిన టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ అల్లు వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది సంతోష్ కుమార్, మరియు మహిళా పోలీస్ సిబ్బంది ఉమ, గిరిజలను ఉన్నతాధికారులు అభినందించారు.  

ప్రజలకు/ప్రయాణికులకు అనకాపల్లి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముఖ్య విజ్ఞప్తి 

​"ప్రజల అప్రమత్తతే నేరాల నివారణకు ఉత్తమ రక్షణ."

​పట్టణంలో బస్సులు, ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులు (ముఖ్యంగా మహిళలు) తమ బంగారు ఆభరణాలు, నగదు మరియు విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.  

ఈ రద్దీ ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండండి 

​అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్,  

​నాలుగు రోడ్ల జంక్షన్, 

​చోడవరం బస్ స్టాప్,  

​పెరుగు బజార్ జంక్షన్, ​బాలకృష్ణ బస్ స్టాప్, ​రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు  

​బస్సులు లేదా ఆటోలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మీ హ్యాండ్ బ్యాగులు, నగదు, సెల్‌ఫోన్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.  

​మీ చుట్టుపక్కల అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల పట్ల నిఘా ఉంచండి.  

​ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా దొంగతనం జరిగినట్లు గమనించినా వెంటనే సమీపంలోని పోలీస్ సిబ్బందికి గానీ, లేదా అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాల్సిందిగా కోరడమైనది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post