ఆగస్టు చివరినాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి తీరతాం మంత్రి నిమ్మల.



 ఆగస్టు చివరినాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి తీరతాం మంత్రి నిమ్మల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 మార్కాపురం జిల్లా కొత్తూర్ గ్రామం వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిమ్మల.

మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్ ను మరియు ఫీడర్ కెనాల్ ను రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు , మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత , జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మరియు ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు తో కలసి ప్రాజెక్ట్ ను సందర్శించి పనుల పురోగతిపై అధికారులు అడిగి తెలుసుకున్నారు.మరోమారు టన్నెల్స్ లోకి వెళ్ళి లైనింగ్, టిబిఎం తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు మరియు ఇతరులు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తి చేశాం.

కొల్లంవాగు నుండి 1 టిఎంసి నీరు టన్నెల్స్ లోకి చేరేలా 1.80లక్షల క్యూబిక్ మీటర్ల కు గానూ, ఇప్పటికి 58 వేల క్యూబిక్ మీటర్ల మక్ తొలగించాం.

టన్నెల్-1 లో అడ్డుగా ఉన్న 1.2 లక్షల క్యూబిక్ మీటర్ల మక్ తొలగింపు పనులలో ఇప్పటికి 40 వేల క్యూబిక్ మీటర్లు తొలగించాం.

20 నెలలో టన్నెల్-2లో 7 కి.మీ లైనింగ్ కి గానూ, 5.5 కి.మీ లైనింగ్ పనులు పూర్తి చేశాం.

మిగిలిన 1.5 కి.మీ లైనింగ్, జూలై చివరి నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి.

5 ఏళ్ళ వైసిపి పాలనలో హైకోర్టు ఆదేశాలతో టన్నెల్-2 లో చిక్కుకుపోయిన టిబిఎం మెషిన్ వెలికితీత పనులు జరుగుతున్నాయి.

టన్నెల్ బోరింగ్ మెషిన్ 7 కంపార్ట్మెంట్ లలో ఇప్పటికి 3 కంపార్ట్ మెంట్లు బయటకు తీసుకొచ్చాం.

టిబిఎం లో క్లిష్టమైన హెడ్ ను టన్నెల్ లోనే పూడ్చిపెట్టడానికి అవకాశాలు పరిశీలిస్తున్నాం.

ఫీడర్ కెనాల్ లో 5.3 కి.మీ రిటైనింగ్ వాల్ పనులు, జనవరిలో ప్రారంభించి నేటికి 5 నెలల్లో పూర్తి చేశామన్నారు .

నత్తనడకన సాగుతున్న 21 కి.మీ లైనింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించిన మంత్రి నిమ్మల రామానాయుడు .

మెంధా తుఫాన్ కు ఫీడర్ కెనాల్ లో పడిన భారీ గండికి సిసి వాల్ నిర్మించి పూర్తి చేస్తున్నాం.తీగలేరు, ఈస్టర్న్ మెయిన్ కెనాల్స్ తో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులు సైతం జూన్ నెలాఖరునాటికిపూర్తికానున్నాయి.

చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం, సీజన్ మొదలయ్యే నాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు.

ఈనెలలో సిఎం చేతుల మీదుగా నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారం అందిస్తామన్నారు.

నల్లమలసాగర్ రిజర్వాయర్ లో నీళ్ళు నింపడానికి నిర్వాసితుల పునరావాసానికి అదనపు బడ్జెట్ లో 905 కోట్లు కేటాయించాం.

 ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post