ఏపీటీపీసీ 65వ బోర్డ్ సమావేశం: పారిశ్రామిక అభివృద్ధిపై కీలక నిర్ణయాలు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
అమరావతి, జూన్ 18:
ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (APTPC) 65వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం చైర్మన్ వజ్జ బాబూరావు అధ్యక్షతన గురువారం జరిగింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ భూముల వినియోగం, పెండింగ్ ఆర్థిక అంశాల పరిష్కారంపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
64వ బోర్డ్ సమావేశపు మినిట్స్‌ను ధృవీకరించిన సభ్యులు, గత నిర్ణయాల అమలుపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను సమీక్షించారు. చిత్తూరుకు చెందిన తాజా అగ్రి ఫుడ్ ప్రొడక్ట్స్ సంస్థ ఒప్పంద నిబంధనలను పాటించని అంశంపై చర్చించి తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
సంస్థలో ఖాళీగా ఉన్న డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టును డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే APIIC వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.10 కోట్ల అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి పొందేందుకు ప్రభుత్వ స్థాయిలో చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
చిత్తూరు జిల్లా యడమర్రి మండలం మజారకోతపల్లెలోని 13.71 ఎకరాల ప్రభుత్వ భూమిని APTPCకి బదిలీ చేసిన విషయాన్ని బోర్డు గమనించింది. ఈ భూమిని భవిష్యత్ పారిశ్రామిక, వాణిజ్య ప్రోత్సాహక కార్యక్రమాలకు వినియోగించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ ఆస్తుల సమర్థ వినియోగం, ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించి సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చైర్మన్ వజ్జ బాబూరావు తెలిపారు.
సమావేశంలో వైస్ చైర్మన్ & ఎండీ శేఖర్ బాబు (IFS), ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదినారాయణ, జేడి ఇండస్ట్రీస్ జి.కృష్ణారావు, డిప్యూటీ సెక్రటరీ హనుమంతరావు, జీఎం హనుమ నాయక్, కంపెనీ సెక్రటరీ కరుణాకర్, అకౌంట్స్ మేనేజర్ శ్రీరామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
