ఏలూరు కార్పొరేషన్ కమీషనర్ పై FIR.


 ఏలూరు కార్పొరేషన్ కమీషనర్ పై FIR.

* ప్రక్కదారి పడుతున్న PGRS సర్వీస్.

* ఏలూరు నగర కమీషనర్ పై ఇరిగేషన్ అధికారి AE దుర్గా రావ్ పిర్యాదు.

* నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్న పోలీస్.

* ఏలూరు ఇరిగేషన్ అధికారి పిర్యాదు నిరూపయోగంగా మిగలాల్సిందేనా.?

* చట్టం అందరికి సమానం కాదా.?

* ఏలూరు నగర కమీషనర్ చట్టానికి అతీతులా.?

* గత రెండు నెలలుగా సాగుతున్న నిర్లక్ష్య వైకరిపై కలెక్టర్ స్పందించక పోవడానికి కారణం ఏమిటి.?

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు జిల్లా ఏలూరు లో గత రెండు నెలలుగా కొనసాగుతున్న నిర్లక్ష్య వై కరి పై ప్రత్యేక కధనం. ఏలూరు పడమటి లాకులు సంబంధించి ఇరిగేషన్ వారి అధీనం లో ఉన్న పురాతన బ్రిటిష్ కట్టడాన్ని మునిసిపల్ కమీషనర్ కూల్చి వేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటి.?

ఏలూరు కృష్ణా కాలువ పడమటి లాకులు కి సంబంధించిన ఇరిగేషన్ వారి అధీనం లో ఉన్న సుమారు 100సంవత్సరాల బ్రిటిష్ కట్టడాన్ని ఏలూరు మునిసిపల్ కమీషనర్ ఎటువంటి సమయం ఇవ్వకుండా నోటీసు ఇచ్చి 24గంటలలో కూల్చి వేశారని ఏలూరు నగర కమీషనర్ పై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో AE దుర్గారావు పోలీస్ వారికీ ఫిర్యాదు ఇచ్చి రెండు నెలలు గడుస్తున్నా.. ఇరిగేషన్ వారి పిర్యాదు పై ఎటువంటి FRI కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న పోలీస్ యాంత్రాంగం. ఇరిగేషన్ అధికారులు వారి అధీనంలో ఉన్న పురాతన బ్రిటిష్ కట్టడాన్ని అన్యాయం గా కూల్చి వేసిన నగర కమీషనర్ పై ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు.?

ఒకప్రక్క పురాతన బ్రిటిష్ కట్టడాలను పరిరక్షించుకోవాలి అని సుప్రీం కోర్ట్ చెపుతున్నా అధికారుల నిర్లక్ష్యానికి కారణం ఏమై ఉంటుంది.. అనేవిషయం అనేక అనుమానాలకు తావు ఇస్తుంది.

PGRS లో వచ్చిన ఫిర్యాదు పై ఏలూరు నగర కమీషనర్ పూర్తి స్థాయిలో పరిశీలించకుండా... ఇరిగేషన్ వారికీ నోటీసు ఇచ్చి సంబంధిత ఇరిగేషన్ ఉన్నత అధికారులకు తెలియ చేసే సమయం ఇవ్వకుండా 24గంటల లోనే పురాతన బ్రిటిష్ కట్టడం కూల్చి వేయడం వెనుక ఆంతర్యం ఏమిటి.? ఎవ్వరికి లబ్ది చేకూర్చడానికి ఈ పని చేసినట్లు.?

దీని వెనుక రాజకీయ నాయకుల పేర్లు వినిపించడం వెనుక ఆంతర్యం ఏమిటి.? PGRS లో వచ్చిన ఫిర్యాదు లు 24గంటలలో ఎక్కడ పరిష్కరించ బడుతున్నాయి.. అనేది ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ అయినా పురాతన బ్రిటిష్ కట్టడం కూలిపోయిన దాకలాలు ఉన్నాయా.? అని ప్రజలు అధిప్రాయ పడుతున్నారు. సుప్రీంకోర్టు సై తం పురాతనబ్రిటిష్ కట్టడాలను పరిరక్షించి కాపాడమని చెపుతుంటే... స్థానిక ఏలూరు నగర కమీషనర్ కి ఆమాత్రం తెలియదా..? పురాతన కట్టడం.. అందులో వేరే డిపార్టుమెంటు (ఇరిగేషన్) వారి అధీనంలో ఉన్న కట్టడాన్ని కూల్చడానికి ప్రత్యేకించి ఇరిగేషన్ అధికారుల అనుమతితో కలెక్టర్ వారి ఉత్తర్వుల తో.. చేయాల్సినపనిని ఏలూరు నగర కమీషనర్ తన అధికార దుర్వినియోగనికి పాల్పడిఇరిగేషన్ వారి అనుమతి లేకుండా కూల్చివేసిన సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవ్వుతున్నాయి.

చట్టం అందరికి సమానం కాదు అనే విషయం పైనజరిగిన సంఘటనలో స్పష్టంగా కనిపిస్తుంది.. ఇరిగేషన్ వారు తాము ఇచ్చిన ఫిర్యాదు పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు 2నెలలు కావస్తుంది అని ఇరిగేషన్ వారు స్థానిక ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి SI గారిని అడుగగా.. ఒక ప్రభుత్వ అధికారి అయ్యివుండి.. భాద్యతా రాహిత్యంగా ఇరిగేషన్ వారిని మీరు ఇచ్చిన ఫిర్యాదు పై FIR కట్టడం కుదరదు.. మీరు వెళ్లి కోర్ట్ లో ప్రవేట్ కంప్లైంట్ వేసుకోండి అనడం వెనుక ఆంతర్యం ఏమిటి.?

ఒక సామాన్యుడు ప్రభుత్వ అధికారియొక్క విధి నిర్వాహనకు అడ్డు పడితే పోలీస్ లు వెంటనే అదుపులోకి తీసుకొని FIR కట్టడం జరుగుతుంది. అలాంటిది ఇరిగేషన్ వారి ఆధీనం లో ఉన్నటువంటి బిల్డింగ్ ను ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం చెపుతున్నా.. కూల్చివేసిన నగర కమీషనర్. ఇరిగేషన్ AE దుర్గారావు తమ ఉన్నత అధికారులనుండి ఎటువంటి ఆదేశాలు బిల్డింగ్ కూల్చమని మాకురాలేదు.. మాకు సమయం ఇవ్వమని చెప్పినా నగర కమీషనర్ వినలేదని వాపోయారు. 

ఇప్పటికి అయినా చట్టం అందరికీ సమానమా.? లేక కొందరికి చట్టంలో మినహాయింపు ఏమైనా ఉందా.? అనే అనుమానాలు వ్యక్తం అవ్వుతున్నాయి..

జరిగిన సంఘటనపై ఏలూరు నగర కమీషనర్ సమాధానం నిర్లక్ష్యంగా ఉండడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవ్వుతున్నాయి... తమకు PGRS లో కంప్లైంట్ వచ్చింది అని, బిల్డింగ్పడిపోయే పరిస్థితిలో ఉందని, ప్రజలకు ప్రాణహాని అని కూల్చి వేసాము అని చెప్పడం హాస్యాస్పద్ధంగా ఉంది. అసలు ఆ బిల్డింగ్ ప్రమాదంగా ఉందని ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో చెప్పరు.. ఏకపక్షంగా వ్యవహారించారాని నగర కమీషనర్ మాటల ధోరణి కనిపిస్తుంది.

ఎక్కడ అయినా పురాతన బ్రిటిష్ కట్టడం కూలిపోయిన దాకలాలు ఉన్నాయా...?

100సంవత్సరాలు పై బడిన పురాతన బ్రిటీష్ కట్టడాన్ని తొలగించాలన్నా, స్థానిక కలెక్టర్ ఆదేశాలు తీసుకొని, ఆ బిల్డింగ్ కి సంబంధించిన వారికి (ఇరిగేషన్ ) సమయంతో కూడిన నోటీసు జారిచేసి.. జారిచేసిన నోటీసుకు ప్రతిష్పందన రాకపోతే.. నిజంగా బిల్డింగ్ కూలిపోయే ప్రమాదకరం పరిస్థితులలో ఉంది అని నిర్ధారించి ఉన్నత అధికారుల(కలెక్ట్) మరియు సంబంధించిన అధికారుల అనుమతులతో.. వారి సమక్షంలో భవనాన్ని కూల్చాలి అనే సామాజిక భాద్యత ఏలూరు నగర కమీషనర్ కి ఏమైన్ది.? దీనిని బట్టి PGRS సర్వీస్ ను ప్రజా ప్రయోజనానికి కాకుండా.. ఏలూరు నగర కమీషనర్ తమ వ్యక్తి గత ప్రయోజనాలకి వాడుకుంటున్నట్లు అందరికి అవగతం అవ్వుతుంది. పైగా స్థానిక రాజకీయ నాయకుల పేర్లు చెపుతూ.. వారి రాజకీయ జీవితానికి మచ్చ తెస్తున్న కమీషనర్. తన అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చే విధంగా నడుచుకుంటున్న నగర కమీషనర్.

ఇప్పటికి అయినా ఉన్నత అధికారులు మేల్కొని..చట్టం అందరికీ సమానం అని నిరూపించి.. అధికార దుర్వినియోగనికి పలుపడిన వారిపై చట్టప్రకారం కేసు నమోదుచేసి వారి వారి భాద్యత గా.. అధికార దుర్వినియోగనికి పాల్పడిన ఏలూరు నగర పాలక సంస్థ కమీషనర్ పై చర్యలు తీసుకుంటారో... లేక... చర్యలు తీసుకోకుండా వారుకూడా అధికార దుర్వినియోగం చేస్తారో.. వేచి చూడాలి.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post