హత్యాచారం కేసులో ముద్దాయికి జైలు శిక్ష వేసిన చోడవరం కోర్టు.
అనకాపల్లి ఫిబ్రవరి:18చోడవరం మండలం
నరసాపురం గ్రామానికి చెందిన బూర సూరి బాబు పై ఒక ఒక సంవత్సరం జైల్ శిక్ష మరియు రూ.1500/- జరిమానా, విధిస్తూ చోడవరం కోర్టు బుధవారం నాడు తీర్పు ఇచ్చింది
చోడవరం సీఐ అప్పలరాజు తెలిపిన కేసు వివరాలు
తేదీ 14.08.2017 రాత్రి 09.00 గంటలకు, ఫిర్యాదుదారు బూర రామణమ్మ, భర్త పేరు అప్పలనాయుడు, వయస్సు 30 సంవత్సరాలు, నర్సాపురం గ్రామ నివాసి, లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పిస్తూ క్రింది విధంగా తెలిపారు తేదీ 12.08.2017 శనివారం రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో, ఫిర్యాది మరియు తన పిల్లలు ఇంట్లో నిద్రపోయారు. ఆమె భర్త ఇంటికి బయట నుంచి తాళం వేసి గ్రామంలో జరిగిన వివాహనికి వెళ్లాడు. అదే రాత్రి సుమారు 11.00 గంటల సమయంలో బూర సూరిబాబు ఇంటి బయట తాళం తీసి లోపలికి ప్రవేశించి ఆమెను లేపాడు. ఆ సమయంలో తన ఇంట్లోకి ఎందుకు వచ్చావని ఆమె అతన్ని అడిగింది. తరువాత అతను ఆమె శరీరాన్ని తాకి తన లైంగిక కోరిక తీర్చుకోవాలని బలవంతం చేశాడు. దానికి ఆమె గట్టిగా అరిచింది. ఆ తగాదాలో ఆమె బట్టలు చిరిగిపోయాయి. ఇదే సమయంలో ఆమె భర్త ఇంటికి వచ్చాడు. అంతలో సూరిబాబు ఇంటి వెనుక భాగంలో ఉన్న వరండా వైపు వెళ్లిపోయాడు. ఫిర్యాది మరియు ఆమె భర్త సూరిబాబును ప్రశ్నించగా, అతను వంటగది లో ఉన్న కత్తి చూపించి పిర్యాదిని, ఆమె భర్త మరియు పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. భయంతో వారు అతన్ని బయటకు పంపించారు. ఈ విషయం ఎవరికి చెప్పినా చంపేస్తానని కూడా సూరిబాబు బెదిరించాడు. అందువల్ల, ఈ విషయంపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
చోడవరం సీఐ అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం, దర్యాప్తు సమయంలో అప్పటి దర్యాప్తు అధికారి కే.మల్లేశ్వరరావు నిందితుడును అరెస్టు చేసి రేమండ్ కు పంపించారు. అనంతరం, సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హరిప్రియ దేవరకొండ ఫిర్యాదుదారి తరఫున కోర్టులో వాదనలు వినిపించిన తరువాత, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, చోడవరం వారు బుధవారం 05.02.2026 నాడు తీర్పు వెలువరించి,. నిందితుడు బూర సూరి బాబు పై ఒక సంవత్సరం సాదారణ జైల్ శిక్ష మరియు రూ.1500/- జరిమానా విదించారు. కోర్ట్ కానిస్టేబుల్ కిల్లంపల్లి నాగరాజు సాక్షులను తీసుకొచ్చి ఈ కేసులో ముద్దాయి కి శిక్ష పడేందుకు కృషి చేశారు.
