ఏలూరులో ప్రారంభం కానున్నజనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం.


ఏలూరులో ప్రారంభం కానున్నజనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం.

ఏలూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..

ఈనెల 26వ తేదీన ప్రారంభమయ్యే జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పై మీడియా సమావేశం.

మూడు రకాల సభ్యత్వాలపై పవన్ కళ్యాణ్ స్పష్టం - జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు వెల్లడి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఏలూరు, ఫిబ్రవరి 19:- రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ ఇటీవలే జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి తొలి సభ్యత్వాన్ని స్వయంగా స్వీకరించడం గర్వకారణం అన్నారు. పార్టీ అభివృద్ధి బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, ప్రతి జనసైనికులు, ప్రతి వీర మహిళలు ముందుకు రావాలని ఆయన కోరారు.

క్రియాశీలక సభ్యత్వం భరోసా - భద్రత.

పార్టీలో కట్టుబడి పని చేస్తూ ఏదైనా అనుకోని ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించిన పక్షంలో, పార్టీ తరపున ఐదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీ అందజేయడం జరుగుతుందని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఇందుకోసం రూ.500 చెల్లించి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు.. ఈ నమోదు ప్రక్రియ ఈనెల 26వ తేదీ నుండి మొదలవుతుందన్నారు. గతంలో సభ్యత్వం తీసుకున్న వారు కూడా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. మూడు విభాగాలుగా సభ్యత్వ ప్రక్రియ సాగుతుందన్నారు.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకే తీసుకెళ్లే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా రూపొందించినట్లు అప్పలనాయుడు తెలిపారు.

1. ఉద్యమి - పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసేందుకు ముందుకొచ్చి సభ్యత్వం స్వీకరించేవారు..

2. సాధక్ - పార్టీ పోరాటానికి బలం చేకూర్చేలా, కొత్తవారిని ప్రేరేపించి నవతరాన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ, సభ్యత్వాలు నమోదు చేయించేవారు. 

3. ప్రదాత - పార్టీకి ఆర్థిక సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పరోక్షంగా బలోపేతానికి కృషి చేసేవారు..

ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, పారదర్శక పాలన, యువతకు అవకాశాల కల్పనపై నిలబడి ఉన్నాయని అన్నారు.. ప్రతి నియోజకవర్గంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించి, రాష్ట్రంలో జనసేనను మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 26వ తేదీ నుండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు.. దీనిలో భాగంగా 18 ఏళ్ళు నిండిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారిని ఉద్యమ ద్వారా సభ్యత్వంలో చేర్పిస్తామని అప్పలనాయుడు అన్నారు.. జనసేన పార్టీలో ఉన్న ప్రతి క్రియాశీలక వాలంటీర్ సాధక్ గా, సభ్యత నమోదు చేస్తూ, పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రదాత పార్టీకి వివిధ మార్గాల ద్వారా అండగా నిలిచేవారని, నాయకత్వం తీసుకుని పార్టీని బలోపేతం చేసే వారిని, గ్రామ, పట్టణ ప్రాంతాల్లో గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూ, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపర్చాలని అన్నారు. జనసేన పార్టీ సభ్యత్వం నమోదు తో పాటు గ్రామ, వార్డు, పట్టణ నగరాల్లో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసి జాతీయ పార్టీగా అభివృద్ధి చెందే విధంగా జనసైనికులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, నగర అధ్యక్షుడు వీరంకిపండు, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, సరిది రాజేష్, రెడ్డి గౌరీ శంకర్, బొండా రాము నాయుడు, బొత్స మధు, కూనిశెట్టి మురళీకృష్ణ, బెజవాడ నాగభూషణం, కొండల ప్రసాద్, జనసేన రవి, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post