డ్రైవర్లు జర భద్రం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం – లారీ యజమానులు, డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మార్కాపురం సబ్ డివిజన్ పోలీసులు.
ట్రాఫిక్ నియమాలు పాటించండి...రోడ్డు ప్రమాదాల బారిన పడకండి.
రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలి: మార్కాపురం డీఎస్పీ.
రోడ్డు ప్రమాదాల నివారణనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ.వి. హర్షవర్ధన్ రాజు, ఆదేశాల మేరకు, మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు ఆధ్వర్యంలో గురువారం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో లారీ యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు మరియు ప్రజలతో కలిసి రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్కాపురం డి.ఎస్.పి. యు. నాగరాజు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం అనేక మంది మరణిస్తున్నారని, దాని వలన ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని గుర్తుచేసి సీట్ బెల్ట్ లేకుండా, మద్యం సేవించి, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకూడదని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, ఓవర్‌స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ (నిర్లక్ష్యంగా వేగంగా నడపడం) చేయకూడదు. మైనర్లు వాహనాలు నడపడం నేరం అని తెలిపారు
మార్కాపురం డీఎస్పీ గారు వాహన యజమానులు, డ్రైవర్లకు పలు సూచనలు.
వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు — డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, పర్మిట్‌లు మొదలైనవి ఎల్లప్పుడూ వాహనంలో ఉండాలి.
వాహనంలో అగ్ని నియంత్రణ పరికరం మరియు ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. వాహనంలో రిఫ్లెక్టివ్ బోర్డులు, సూచిక లైట్లు, రియర్ ప్రొటెక్షన్ పరికరాలు తప్పనిసరిగా అమర్చుకోవాలి.
లారీ డ్రైవర్లకు తగినంత విశ్రాంతి (నిద్ర) ఉండేలా యజమానులు చూడాలి. అలసటగా అనిపిస్తే వాహనాన్ని భద్రమైన ప్రదేశంలో ఆపి విశ్రాంతి తీసుకోవాలి. రెండవ డ్రైవర్ ఉంటే దూర ప్రయాణాల్లో మార్చుకొని డ్రైవింగ్ చేయాలి.
మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదమని, చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.
వాహనాలను ఓవర్ లోడ్ చేయరాదని, అధిక బరువు ఉండటం వల్ల వాహన నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రాష్ డ్రైవింగ్, ఓవర్ టేకింగ్, సడన్ ల్యాన్ మారటం చేయరాదని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి.
చరవాణి తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, అవసరమైతే వాహనం ఆపి మాత్రమే మాట్లాడాలి. వాహన టైర్లు, బ్రేకులు, లైట్లు, సూచికలు సక్రమంగా పనిచేస్తున్నాయా అని తరచూ తనిఖీ చేసుకోవాలి. ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇవ్వాలని, సంఘటన స్థలం నుండి పారిపోకూడదన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న లారీ యజమానులు, డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలనే ఈ అవగాహనను ఇతరులకు పంచేందుకు ప్రమాణం చేశారు. పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఎస్పీ. అన్నారు.కార్యక్రమంలో కంభం సీఐ కె. మల్లికార్జున, బివి.పేట ఎస్సై రవీంద్ర రెడ్డి, కంభం ఎస్సై నరసింహారావు మరియు సిబ్బంది పాల్గొనున్నారు.

