బండ్లమూడి లో దారికి గురైన బాధితులకు రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేత.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడిలో దాడికి గురైన బాధితులకు ప్రభుత్వం తరఫున న్యాయం జరిగేలా చూస్తామని జాయింట్ కలెక్టర్.ఆర్. గోపాల కృష్ణ చెప్పారు. ఈ ఘటనలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు కావడంతో ఒంగోలు రిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులకు రిలీఫ్ కింద గురువారం ఆయన ఆర్థిక సహాయం అందజేశారు. కంట్లం ఏసుదాసుకు రూ.50 వేలు, కంట్లం రామయ్యకు రూ.25 వేలు, కంట్లం ఎలీసమ్మకు రూ.25 వేలు, కంట్లం ఏసేపుకు రూ.25 వేలు విలువైన బ్యాంకు చెక్కులను ఇవ్వటం జరిగింది . బాధితులకు అందిస్తున్న వైద్య వివరాలను వైద్యులను అడిగి ఆయన తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంట డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, చీమకుర్తి తహసిల్దార్ బ్రహ్మయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

