బాపూజీ 156వ జయంతి వేడుకలు.



 బాపూజీ 156వ జయంతి వేడుకలు.


ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు. 

 ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఘనంగా నిర్వహించారు.

 ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ.వ్యక్తిత్వం, చూపిన మార్గం అందరికీ అనుసరణీయమని అన్నారు. 

మహాత్మా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఒంగోలు గాంధీరోడ్డులోని గ్రామచావిడి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పీ.రాజాబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శాసన సభ్యులు దామచర్ల జనార్దన రావు, బీ.ఎన్.విజయ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, పీ.డీ.సీ.సీ. బ్యాంక్.చైర్మన్. కే.సీతా రామయ్య, మేయర్ గంగాడ సుజాత లు కలిసి పూల మాలలు వేసినివాళులర్పించారు. 

ఈ సందర్భంగా గ్రామ చావిడి పునర్ నిర్మణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్బంగా మంత్రి డోలా  బాలవీరాంజనేయస్వామి విలేకరులతో మాట్లాడుతూ, ఈ రోజు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల జయంతులను నిర్వహించుకోవడం మనందరి అదృష్టమన్నారు. వారు చూపిన మార్గం పయనిస్తూ వారి ఆశయాలను స్పూర్తిగా తీసుకుని నడవాలన్నారు. 40 లక్షల రూపాయల వ్యయంతో గ్రామచావిడిని పునర్ నిర్మిస్తున్నామని, ఇది అందరికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్బంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా 10 మంది పారిశుద్ద్య కార్మికులను సన్మానించారు.

Post a Comment

Previous Post Next Post