ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లకు హోంమంత్రి అనిత క్లాస్.
విజయనగరం జిల్లాలో పర్యటించిన హోంమంత్రి వంగలపూడి అనిత.
విజయనగరం జిల్లా చింతలవలసలోని 5వ బెటాలియన్ సమీపంలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను హోంమంత్రి వంగలపూడి అనిత గమనించారు.
తన కాన్వాయ్‌ను అక్కడే ఆపించి, మైనర్లను సుతిమెత్తగా మందలించారు. వాహనాలను చట్ట విరుద్ధంగా మైనర్లకు ఇవ్వడం నేరమని గుర్తు చేసిన హోంమంత్రి, ఈ ఘటనను తల్లిదండ్రులకు తెలియజేయాలంటూ పోలీసులు ఆదేశించారు.
ఈ సందర్భంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ వాహనాలను నడిపే వయస్సు రాకముందే పిల్లలకు స్కూటీలు, బైకులు ఇవ్వడం వల్ల వారు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారన్నారు.
ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు, సమాజంలోని రహదారి భద్రతకు ముప్పుగా మారుతుందని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో చట్ట నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆమె సూచించారు.
