ప్రియుడి మోజులో పడి భర్తను, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన కసాయి తల్లి.
* కూతురిని హత్య చేసి అడవిలో మృతదేహం పడేసి, చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లుసృష్టించిన కిల్లర్ లేడీ
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వడితల గ్రామంలో దారుణ ఘటన
* భర్త పక్షవాతంతో బాధపడుతుండగా,
* అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కవిత అనే మహిళ.
* ఈ వివాహేతర సంబంధం గురించి తెలుస్తుందని భర్తను జూన్ 25న చంపి వ్యాధితో చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తి.
* వివాహేతర సంబంధం విషయం కూతురికి కూడా ఎలాగైనా తెలుస్తుందని, ప్రియుడితో కలిసి వర్షిణి(22)ను కూడా కడతేర్చిన కసాయి తల్లి.
* కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి - కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, చుట్టూ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి ఆధార్ కార్డు పెట్టి నరబలిలా నమ్మించిన కవిత.
* పోలీసుల దర్యాప్తులో కవిత తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయగా విస్తుపోయే నిజాలు.
* 2 నెలల క్రితం ప్రియుడితో కలిసి భర్తను, ఇప్పుడు కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకున్న కిల్లర్ లేడీ.. మరో హత్య కోసం కూడా ప్లాన్.
* ప్రియుడిని, కవితను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపిన పోలీసులు.
