స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో శిక్షణ తరగతులు.





 స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో శిక్షణ తరగతులు.

తెలంగాణా, సికింద్రాబాద్ సెప్టెంబర్ 26:

 సికింద్రాబాద్ లాలాగూడ మైగ్రేంట్ అసిస్టెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్ అర్గనైజేషన్ తరపున స్వచ్ఛంద సంస్థలతోపాటు వలస కార్మికులకు సహకారిగా వివిధ సంస్థల్లో పని చేస్తున్న వారికి పౌర సంఘాలు ముందుకు వచ్చి 2 రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని సత్యోదయం సెంటర్ సౌత్ లాలగూడలో నిర్వహించారు.

ముఖ్యంగా సమాజంలో వలసదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి వక్తలు పలు సలహాలు, సూచనలు ఈ సందర్భంగా అందజేశారు.

వలసదారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని, వలసదారుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు శ్రద్ధ చూపెట్టాలని వక్తలంతా పేర్కొన్నారు.

 తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మరియు వాటి నివారణ కోసం అన్ని సంస్థలు ఉమ్మడిగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో మాజీ హ్యూమన్ రైట్స్ ఫోరం అధ్యక్షులు జీవన్ కుమార్ మరియు మాజీ సైంటిస్ట్ బాబురావు, ప్రొఫెసర్ అమృతా దత్త, సిస్టర్ లిసి, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కే మురళి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post