చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవు ఎస్పి.


 చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవు ఎస్పి. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా ‘స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు’ కార్యక్రమానికి సంబంధించి సచివాలయ ఉద్యోగులు చేపట్టనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు మంజూరు కాలేదని మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, తెలిపారు.

అనుమతులు లేకుండా నిర్వహించే కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొనవద్దని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, చట్టపరమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post