APWJF అనుబంధ సంఘం - ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘ ఏలూరు జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.


 APWJF అనుబంధ సంఘం - ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘ ఏలూరు జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.

ఏలూరు:క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) అనుబంధ సంఘమైన ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంఘం ఏలూరు జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.

ఏలూరులో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర సంఘ అధ్యక్ష, కార్యదర్శులు హుస్సేన్ ఖాన్, కలి శ్రీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఏలూరు జిల్లా చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడిగా ఉమామహేశ్వరరావు (పండు - ఆంధ్రా డైరీ), జిల్లా కార్యదర్శిగా శేఖర్ (మంజీరా గళం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమం APWJF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.డి. జబీర్, వై.వి. హరీష్ అధ్యక్షతన జరిగింది.

అనంతరం నూతనంగా ఎన్నికైన చిన్న పత్రికల జిల్లా కార్యవర్గానికి APWJF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు అభినందనలు తెలిపారు. చిన్న పత్రికల సంక్షేమానికి, వాటి మనుగడకు తమ ఫెడరేషన్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

 ఈ సమావేశంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్. కె బాల సౌరి. షేక్ షకీర్ బాబ్జి. ఏపీ బీజేఏ అధ్యక్షులు పి నారాయణరావు. సిటీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్. కే సోమశేఖర్. మిల్టన్ ,ఎం వివి సత్యనారాయణ. శ్రీనివాస్ ,శ్రీనివాస్. సతీష్ కుమార్ ,మౌనిక ,దాసరి చందు ,ఎర్ర జయదాసు వెంకటరావు. సన్నీ,రవికుమార్ ,సుధాకర్, శరత్ బాబు ,తదితరులు పాల్గొన్నారు.

చిన్న పత్రికల ఏలూరు జిల్లా నూతన కమిటీ. 

అధ్యక్షులు : ఉమామహేశ్వరరావు( ఆంధ్ర డైరీ పండు). 

కార్యదర్శి : శేఖర్ (మంజీరా గలం ఎడిటర్). 

కోశాధికారి : సుబ్రహ్మణ్యం. (ప్రజాభూమి బ్యూరో). 

ఆర్గనైజింగ్ కార్యదర్శి : సత్యనారాయణ. 

ఉపాధ్యక్షులు : షేక్ బాబ్జి. డి సుధాకర్. 

సహాయ కార్యదర్శి : రెడ్డి అప్పలనాయుడు( రవి), రామచంద్ర రావు( చందు).

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post