ఏలూరు నియోజకవర్గ APWJF నూతన కమిటీ ఎన్నిక.


 ఏలూరు నియోజకవర్గ APWJF నూతన కమిటీ ఎన్నిక. 

అధ్యక్షుడిగా చదలవాడ ప్రతాప్, కార్యదర్శిగా కె.వి. సుబ్రమణ్యం.

ఏలూరు:క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) ఏలూరు నియోజకవర్గ సమావేశం శుక్రవారం నాడు ఏలూరు ఇండోర్ స్టేడియం వద్ద ఉన్న పంచాయతీరాజ్ అతిధి గృహంలో ఘనంగా జరిగింది. ఏలూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.డి. జబీర్, వై.వి. హరీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా చదలవాడ ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా కె.వి. సుబ్రమణ్యం ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి APWJF ఎల్లప్పుడూ ముందుంటుందని, జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం ఫెడరేషన్ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ జర్నలిస్టుల ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాష్ట్ర చిన్న పత్రికల అధ్యక్షులు హుస్సేన్ ఖాన్. కార్యదర్శి కలిమి శ్రీ. ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్. కె బాల సౌరి. ఏపీ బీజేఏ అధ్యక్షులు పి నారాయణరావు. షేక్ షకీర్ బాబ్జి, సిటీ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్. కే సోమశేఖర్. మిల్టన్,ఎం వివి సత్యనారాయణ. శ్రీనివాస్ ,శ్రీనివాస్. సతీష్ కుమార్ ,దాసరి చందు ,ఎర్ర జయదాసు వెంకటరావు. సన్నీ,రవికుమార్ ,సుధాకర్, శరత్ బాబు ,తదితరులు పాల్గొన్నారు.

 ఏలూరు నియోజకవర్గం నూతన కమిటీ . 

అధ్యక్షుడు : చదలవాడ ప్రతాప్. 

కార్యదర్శి : కెవి సుబ్రహ్మణ్యం. 

కోశాధికారి : డి దొరబాబు. 

ఉపాధ్యక్షులు : శరత్ కుమార్.

సహాయ కార్యదర్శులు : వి మౌనిక , వినుకొండ బాబ్జి.

కమిటీ మెంబర్ : సోమేశ్వరరావు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post