ఏలూరు SBI మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో “సోలార్ సఖి” కార్యక్రమం.
ఏలూరు :సెప్టెంబర్22, క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
మహిళలను సౌర విద్యుత్ రంగంలో భాగస్వామ్యం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక భాగస్వామిగా “సోలార్ సఖి – నారీ శక్తి సోలార్ శక్తి అనుసంధాన్ అభియాన్” కార్యక్రమాన్ని చేపడుతోంది.
మహిళలకు సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణ, గ్రిడ్ కనెక్షన్, మానిటరింగ్, భద్రతా అంశాలపై శిక్షణ, అవగాహన కల్పించనున్నారు.
మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కార్యక్రమం లక్ష్యం.
సోలార్ సఖి కార్యక్రమంపై SBI, కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ADB ఆధ్వర్యంలో సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థల నిర్వహణపై మహిళలకు శిక్షణ అందించే మార్గదర్శిని రూపొందించారు.
సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడంతో పాటు మహిళలకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో Mr జిగర్ బట్. ఎనర్జీ స్పెషలిస్ట్, ఎషియాన్ డెవలప్మెంట్ బ్యాంక్. పి. కాళీ దాసు, SBI రీజనల్ మేనేజర్, ఏలూరు రీజనల్ ఆఫీస్, కుందన్ జ్యోతి GM NW II, K.M. అంబేద్కర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ APEPDCL, శ్రీమతి షితక్షి సింగ్ DGM B&O, G. V. రావ్ DGM ESG &CFU, SBI కార్పొరేట్ సెంటర్ ముంబాయ్, ప్రమోద్ మిశ్రా DGM retail SBI LHO అమరావతి సర్కిల్ హైదరాబాద్ తదితరులు పాల్గొన్నారు.
