జర్నలిస్టులకు రైల్వే పాసులు మంజూరు చేయండి.
రాయితీతో కూడిన కార్డులను పునరుద్ధరించండి.
దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాధుర్ కు ఫెడరేషన్ వినతి.
కేంద్రానికి నివేదిస్తా.. పరిధి మేరకు సహకారం అందిస్తా.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
విశాఖపట్నం ఆగస్టు:11
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులకు రైల్వే పాసులు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు విజ్ఞప్తి చేశాయి..ఈ..మేరకు మంగళవారం దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాదుర్ ను పలువురు జర్నలిస్టులు కలిసి వినతి పత్రాలు సమర్పించారు..ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు(కార్యదర్శి )గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణలు మాట్లాడుతూ కోవిడ్ కు ముందు జర్నలిస్టులకు రాయితీతో కూడా రైల్వే పాసులు ప్రతి ఏటా మంజూరు చేసే వారిని జిఎం కి వివరించారు.. అయితే కోవిడ్ తర్వాత జర్నలిస్టుల రైల్వే పాసులను తిరిగి పునరుద్ధరించలేదనీ..
ఈ విషయమై కేంద్ర రైల్వే మంత్రి.. రైల్వే బోర్డు
జనరల్ మేనేజర్ కు కూడా తాము పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేసామని ఆయనకు తెలియజేశారు..అయితే రైల్వే పాసుల పునరుద్ధరణ పై ఎటువంటి పురోగతి కనిపించ లేదని జిఎంకు వివరించారు.. జర్నలిస్టుల వినతపై జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాసులకు సంబంధించి తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.అయితే కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.. తాను కూడా జర్నలిస్టులు అందించిన వినతి పత్రాలను కేంద్రానికి నివేదిస్తామన్నారు.. తన పరిధి మేరకు జర్నలిస్టులకు సహాయం అందిస్తానన్నారు..
సింహాద్రి నాధుడు జ్ఞాపిక.. చందన ప్రసాదం బహుకరణ.
దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ను కలుసుకున్న సందర్భంగా గంట్ల శ్రీనుబాబు సింహాచలం స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి సింహాద్రినాథుడి జ్ఞాపిక అందజేశారు.. అలాగే అత్యంత మహిమాన్వితమైన చందన ప్రసాదము జిఎం కి అందించగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూపం ఎంతో విశిష్టమైనది అన్నారు.. తాను కూడా స్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు..రైల్వే జిఎం ను కలుసుకున్న వారిలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు
బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇ.ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్.. కార్యదర్శి కె శ్రీనివాస రావు.. ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్,టి.కృష్ణమూర్తి నాయుడు,పి.నగేష్ బాబు, బొబ్బర్ ప్రసాద్,హరి
తదితర కార్యవర్గ సభ్యులు అంతా పాల్గొన్నారు
