కొర్లపాటి హెప్సిబా ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ.
వెలగపూడి: ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ నూతన కార్యదర్శిగా కొర్లపాటి హెప్సిబా సోమవారం వెలగపూడి సచివాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె హౌసింగ్ శాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, పురోగతిపై ఉన్నతాధికారులతో కలిసి ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకుని, పుష్పగుచ్ఛాలు అందిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
