అరసవల్లి ఆలయ పాలక మండలి సభ్యుడిగా కొర్ల కన్నారావు.


 అరసవల్లి ఆలయ పాలక మండలి సభ్యుడిగా కొర్ల కన్నారావు.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.

మందస: శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ జి.ఓ.ఆర్.టి. నెం. 859ను విడుదల చేసింది.

నూతన పాలక మండలిలో సభ్యుడిగా మందస మండలానికి చెందిన ప్రముఖుడు కొర్ల కన్నారావు నియమితులయ్యారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇప్పిలి జోగ సన్యాసిరావుతో పాటు ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర్ శర్మను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వం నియమించింది.

పాలక మండలి సభ్యులుగా అందవరపు రఘురామ్, చింతపల్లి దుర్గారావు, గాంధీ జువ్వాది విష్ణుప్రియాంక, పాత్రని పాపారావు, వెంకట్రావు, భారతి, డాక్టర్ దుంగ హర్షవల్లి, మంగళంపల్లి వరలక్ష్మి, కొర్ల కన్నారావు, కొయ్యన రామ్మోహనరావు, చవిటిపల్లి కొండలరావు తదితరులను నియమించారు.

అభినందనలు

కొర్ల కన్నారావును అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమించినందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ, వెంకన్న చౌదరి తదితరులకు కొర్ల కన్నారావు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు మార్పు వెంకటేష్, దుంపల శంకర్‌రావు, కొంచాడ సురేష్‌కుమార్ తదితరులు కొర్ల కన్నారావును అభినందించారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలిలో సభ్యుడిగా అవకాశం లభించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు నూతన పాలక మండలి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post