నూతన ఏలూరు సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బురదగుంట లివిన్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ అవిద్భావ దినోత్సవ వేడుకలు.


నూతన ఏలూరు సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బురదగుంట లివిన్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ అవిద్భావ దినోత్సవ వేడుకలు.

ది.09.07.2026 ఏలూరు క్రైమ్ నైన్ మీడియా ప్రతినిధి:- సన్నీ చక్రవర్తి.

ఏలూరు కాంగ్రెస్ కార్యాలయంలో 66వ యూత్ కాంగ్రెస్ అవిద్భవ దినోత్సవం సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బురదగుంట లివిన్ క్రిస్టియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఏలూరు జుటెమిల్ సెంటర్ నుండి బైక్ ర్యాలీ తో మొదలై, పోటీ శ్రీరాములు గారి విగ్రహారం దగ్గర నుండి ఏలూరు సిటీ కాంగ్రెస్ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళటం జరిగింది. కాంగ్రెస్ కార్యాలయం లో యూత్ కాంగ్రెస్ జెండా ఎగురవేసి, యూత్ కాంగ్రెస్ ప్రతిజ్ఞ చేసి, యూత్ కాంగ్రెస్ చరిత్ర గురించి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ.ప్రతాప సుబ్రమణ్య శర్మ ,రాష్ట్ర సేవాదళ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ.కమ్ముల కృష్ణ ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ దండుబోయిన చంద్ర శేఖర్, అంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి శ్రీ.బురదగుంట కాంతి రవి కిరణ్, గౌడు రంగబాబు, సాకే బాబు ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాసరి రామ్ ప్రసాద్, సేవాదళ్ సుబ్బారావు, వందల సంఖ్యలో యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొనారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, యువతకు పెద్దపీట వేసి యువతని రాజకీయలో అవకాశాన్ని కల్పిస్తూ, యువ నాయకులను ఎంతో మందిని తయారు చేసింది అని సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బురదగుంట లివిన్ క్రిస్టియన్ మాట్లాడారు, విద్యార్థులపై జరిగే ప్రతి అన్యాయని యూత్ కాంగ్రెస్ ప్రశ్నిస్తుంది, యువతకు వెన్నంటే ఉంటుంది అని తెలియపరిచారు. కార్యక్రమం అనంతరం అందరూ స్వీట్స్ తినిపించుకొని, శుభాకాంక్షలు చెపుకున్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post