పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన.



 పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్.

పలాస, ఆగస్టు 12: 

యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ (APSACS) ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (DISHA) సహకారంతో DISHA Truckers ప్రాజెక్టు ఆధ్వర్యంలో ‘ఇంటెన్సిఫైడ్ IEC క్యాంపెయిన్’ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం. మాధవరావు ప్రచార మార్గాల ద్వారా హెచ్‌ఐవీ నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. కౌన్సిలర్ బి. శ్రీకాంత్ హెచ్‌ఐవీ–ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ, అపోహలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. రాంగోపాల్ మాట్లాడుతూ హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడంతో పాటు, తమకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియజేసి సమాజంలో చైతన్యం తీసుకురావాలని కోరారు.

కార్యక్రమంలో డాక్టర్ పి. మధు, బి. శ్రీకాంత్, ప్రాజెక్ట్ మేనేజర్ ఎం. మాధవరావు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, DISHA Truckers ప్రాజెక్ట్ M&E, HE & PE సిబ్బంది, గెస్ట్ PM, ICTC కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post