నాగులగూడెం గ్రామ ప్రధాన రోడ్డు సమస్యను తక్షణమే పరిష్కరించాలి– సీపీఐ(ఎం) మండల కన్వీనర్ జి. సూర్యకిరణ్.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.
జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎం) మండల కన్వీనర్ జి. సూర్యకిరణ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి మండల కమిటీ సభ్యులు నిట్ట నాగరాజు అధ్యక్షత వహించారు. అనంతరం జి. సూర్యకిరణ్ మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నుండి నాగులగూడెం గ్రామానికి వెళ్లే రహదారిని తక్షణమే నిర్మించి ప్రజల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా గ్రామ స్మశాన వాటికకు సరైన రహదారి లేక అంత్యక్రియల సమయంలో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్మశాన వాటికకు వెంటనే రహదారి నిర్మించాలని, గ్రామంలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన హ్యాండ్‌పంపుకు షెడ్ నిర్మించి ప్రజలకు నీడ సౌకర్యం కల్పించాలని, గ్రామంలో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని కోరారు.
ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ గ్రామ సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయని, నాగులగూడెం గ్రామ ప్రజల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. గ్రామ ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి, రోడ్డు, స్మశాన వాటిక రహదారి, తాగునీటి సౌకర్యం తదితర సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు ఎం. బాలరాజు, నాగులగూడెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
