బద్లావ్ జరూరీ హై మార్పు కావాలి.



 బద్లావ్ జరూరీ హై మార్పు కావాలి. 

 కేంద్రంలో బిజెపి ప్రజా వ్యతిరేక పాలనను నిరసించండి. సి పి ఐ.

 ప్రజాస్వామ్య రక్షణకై భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్త ఇంటింటి ప్రచారం.

 మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల కేంద్రంలో ఈరోజు సిపిఐ పార్టీ ప్రదర్శన అనంతరము ఇంటింటికి కరపత్ర ప్రచారం చేయటం జరిగింది. 

ఈ కార్యక్రమానికి మండల సిపిఐ కార్యదర్శి లొట్టి ఈశ్వర్. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కల్లూరి జయచంద్ర సిపిఐ మండల సహాయ కార్యదర్శి సయ్యద్ ఖదీర్ ల ఆధ్వర్యంలో. ఇంటింటి కరపత్ర కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా. నాయకులు మాట్లాడుతూ సెప్టెంబరు ఒకటి తేదీన చలో ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య బద్దంగా భారత రాజ్యాంగం ప్రకారము ఈవీఎం లను రద్దుచేసి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలను పునరుద్ధరించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ప్రతి ఒక్కడికి ఉద్యోగం కల్పించాలి మహిళా రిజర్వేషన్లను తక్షణము అమలు చేయాలని కార్మికుల హక్కులను పరిరక్షించాలని ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలని సార్వత్రిక విద్య ఆరోగ్యం అందుబాటులోకి తేవాలని మరియు పంటలకు కనీసం మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని.

 దళిత ఆదివాసులపై ఆకృత్యాలను దాడులను నిలిపివేయాలని దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు కఠిన శిక్షలు తీసుకోవాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు. బి శ్రీనివాస్. ఎం రామచంద్రయ్య. ఎం శంకరయ్య. ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి. ఎస్ ఆంజనేయులు . సత్యనారాయణ. మున్సిపల్ జిల్లా నాయకులు. ఎం రామచందర్. రామ్ కుమార్.

జె రమేష్. . సయ్యద్ జాకీర్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post