టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం.



 టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

 మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోనీ కంభం అర్బన్ కాలనీలో గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 52వ బూత్ పరిధిలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

52వ బూత్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించడం జరిగింది.

ప్రజలతో నేరుగా మాట్లాడి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ సభ్యుడు సయ్యద్ రఫీ, మైనారిటీ నాయకుడు ఖాసిం, రమీజా మరియు ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post