బేస్తవారిపేట లో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన ముత్తుముల.



 బేస్తవారిపేట లో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన ముత్తుముల.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

రక్తదానం.. ప్రాణ దానం: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి.

మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట పట్టణంలోని న్యూ స్వప్న హోటల్ వారి ఆధ్వర్యంలో సత్వేలి క్రిష్ణయ్య యాదవ్ వారి కుమారుడు శివకృష్ణ గారు రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు రక్తదాన శిబిరాన్ని పరిశీలించి, రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించారు. అత్యవసర సమయాల్లో రక్తం అందక అనేకమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇటువంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

రక్తదానం చేయడం ద్వారా ఒకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. 

సమాజ సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన న్యూ స్వప్న హోటల్ ప్రొప్రైటర్ సత్వేలి క్రిష్ణయ్య యాదవ్ ను వారి కుమారుడిని ప్రత్యేకంగా శాసనసభ్యులు అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి శాసనసభ్యులు పళ్ళ రసాల పంపిణీ స్వయంగా అందజేశారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, బేస్తవారిపేట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post