ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఎమ్మెల్యే గౌతు శిరీష.



 ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జులై 3 : 

పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజలు భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, రహదారులు, తాగునీరు, విద్యుత్, పెన్షన్లు, ఉపాధి, వైద్యం తదితర అంశాలకు సంబంధించిన వినతులను ఆమెకు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రతి వినతిని ఎమ్మెల్యే శ్రద్ధగా పరిశీలించి, సమస్యల స్వరూపాన్ని తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధి బాధ్యత అని, ప్రతి సమస్యను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ప్రజలు కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post