గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 3: బారువ–సోంపేట రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 650/11–13 వద్ద ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ సమీపంలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పలాస జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.
మృతుడు సుమారు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగిన పురుషుడిగా గుర్తించారు. అతని ఎత్తు సుమారు 5 అడుగులు. బ్లూ జీన్స్ ప్యాంట్, నలుపు రంగు హాఫ్ హ్యాండ్స్ టీ-షర్ట్ ధరించి ఉండగా, టీ-షర్ట్‌పై తెలుపు రంగు అక్షరాలతో "SOOFI CAFE" అని ముద్రించి ఉంది. వర్షాల కారణంగా మృతదేహం ఉబ్బిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పలాస జీఆర్‌పీ హెడ్ కానిస్టేబుల్ ఎం. సోమేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు లేదా అతడిని గుర్తించగలిగిన వారు 9492250069 నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
