బెల్ట్ షాప్‌పై పోలీసుల మెరుపు దాడి – 27 క్వార్టర్ మద్యం సీసాలు స్వాధీనం.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలకలవీడు గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్‌పై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బెస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
దాడి సందర్భంగా నిందితుడి వద్ద నుంచి 27 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో అక్రమ మద్యం విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని ప్రజలను కోరారు.
