వివాహిత అనుమానాస్పద మృతి కేసు నమోదు – దర్యాప్తు చేస్తున్న చోడవరం సీఐ పి అప్పలరాజు.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జులై:27
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన శ గడదాసి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కుమార్తె కుర్మదాసు భవ్యశ్రీ (23) సోమవారం అనుమానాస్పద మృతి ఘటనపై చోడవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, భవ్యశ్రీ వివాహం 22.08.2021న దుడ్డుపాలెం గ్రామానికి చెందిన కుర్మదాసు శ్రీనుతో జరిగింది. వివాహ సమయంలో నగదు, బంగారు ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం కొనుగోలుకు నగదు రూపంలో కట్నం ఇచ్చినట్లు ఫిర్యాదుదారు తెలిపారు. గత రెండేళ్లుగా భర్త కుర్మదాసు శ్రీను, అతని తమ్ముడు కుర్మదాసు హరి, వారి తల్లి కుర్మదాసు ఈశ్వరమ్మలు అదనపు కట్నం కోసం భవ్యశ్రీని మానసికంగా, శారీరకంగా వేధిస్తూ హింసించారని ఆరోపించారు.
27తేదీ సోమవారం ఉదయం భవ్యశ్రీ ఉరివేసుకుని మృతి చెందినట్లు ఆమె అత్తింటి కుటుంబ సభ్యులు తెలియజేయడంతో ఫిర్యాదుదారుకు విషయం తెలిసింది. వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా భవ్యశ్రీ మృతదేహం పెదవిపై గాయం ఉన్నట్లు గమనించారని, తన కుమార్తె ఆత్మహత్య చేసుకునే స్వభావం కలిగినది కాదని, భర్త కుర్మదాసు శ్రీను, అతని తమ్ముడు కుర్మదాసు హరి, వారి తల్లి కుర్మదాసు ఈశ్వరమ్మలు కలిసి హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారని అనుమానం వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా చోడవరం పోలీస్ స్టేషన్ స్టేషన్ సీఐ పి. అప్పలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌డీపీఓ, అనకాపల్లి వారు మరియు క్లూస్ టీమ్ వారు సంఘటన స్థలాన్ని పరిశీలించి శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. అనంతరం చోడవరం తహసీల్దార్ సమక్షంలో పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. పూర్తి విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే వాస్తవాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు
