గిరిజన మత్స్యకారులకు పరికరాల పంపిణీ.
75 శాతం సబ్సిడీతో ఐస్ బాక్స్‌లు, చేపల వలలు అందజేత.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 4:
గిరిజన మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష అన్నారు. పలాస ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శనివారం ఐటిడిఏ సీతంపేట, శ్రీకాకుళం మత్స్యశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్‌సీఏ టు టీఎస్‌ఎస్ (2020–21) పథకం కింద గిరిజన మత్స్యకారులకు మత్స్య పరికరాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా 75 శాతం సబ్సిడీపై ఏడు మోపెడ్లకు అనుసంధానించిన ఐస్ బాక్స్‌లు, ఐదు చేపల వలలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆధునిక మత్స్య పరికరాల వినియోగంతో చేపల నిల్వ, రవాణా సులభతరం కావడంతో పాటు మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. గిరిజన కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఐటిడిఏ ఎఫ్‌డీఓ, మత్స్యశాఖ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

