గోవాడలో విశ్వ హిందూ పరిషత్ ఉత్తరాంధ్ర దుర్గ వాహిని వర్గ దిగ్విజయంగా నిర్వహణ.
క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.
అనకాపల్లి జులై:27
అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం, గోవాడ గ్రామంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గ వాహిని వర్గ దిగ్విజయంగా ముగిసిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి పీలా హేమ. జగదీష్ నాయుడు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూ సమాజంలో యువతులను ధార్మికంగా, దేశభక్తితో, సంస్కారవంతులుగా తీర్చిదిద్దడమే దుర్గ వాహిని వర్గ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ వర్గంలో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, శారీరక శిక్షణ, యోగాభ్యాసం, స్వీయ రక్షణ విద్య, సేవా కార్యక్రమాలు, హిందూ సంస్కృతి, భారత చరిత్ర, ధర్మాచరణ, సంఘటిత శక్తి ప్రాముఖ్యత, దేశభక్తి మరియు సమాజ సేవ వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా ప్రాంత మాతృశక్తి వర్గ సంయోజిక శ్రీమతి సునీత దేవి, ప్రాంత వాహిని సంయోజిక
శోభా రాణి పాల్గొని దుర్గ వాహిని కార్యకర్తల బాధ్యతలు, మహిళా శక్తి ప్రాధాన్యం, సమాజ నిర్మాణంలో యువత పాత్రపై మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డా. డి.డి. నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు రామకొండారావు, ప్రాంత సభ్యులు శ్రీకాళహస్తి, జిల్లా కోశాధికారి రమేష్, జిల్లా సేవా ప్రముఖ్ నందన శర్మ, నగర సహాయ కార్యదర్శి మల్లేశ్వరరావు, విహెచ్‌పీ కార్యకర్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.
