ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ పీజీ విద్యార్థులతో ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.



 ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ పీజీ విద్యార్థులతో ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు, జూలై 11: ప్రపంచ జనాభా దినోత్సవం–2026 సందర్భంగా వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) ఆదేశాల మేరకు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ADME/ప్రిన్సిపాల్ డా.ఎస్. శ్రీవాణి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. బి. శ్రీదేవి మార్గదర్శకత్వంలో, నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జి.అశ్వన్ సమన్వయంతో నేడు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజలకు కుటుంబ నియంత్రణ, పునరుత్పత్తి ఆరోగ్యం, జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ అనంతరం పీజీ విద్యార్థులు, జూనియర్ వైద్యులు ఫ్లాష్‌మాబ్, వీధి నాటిక (స్కిట్) ప్రదర్శించి "ఉజ్వల భవిష్యత్తు కోసం కుటుంబ నియంత్రణ" అనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జి. అస్వన్ మాట్లాడుతూ కుటుంబ నియంత్రణలో సరైన ఎంపిక, పునరుత్పత్తి ఆరోగ్యం పరిరక్షణ, దేశ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని వివరించారు.

అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల, ఒంగోలులో కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.

తదనంతరం కమ్యూనిటీ మెడిసిన్ విభాగం మరియు ప్రసూతి-స్త్రీ వైద్య విభాగం సంయుక్తంగా నిరంతర వైద్య విద్య (CME) కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వినీల ప్రియాంక భారతదేశ జనాభా ధోరణులపై (Demographic Trends in India), ప్రసూతి-స్త్రీవైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. షోనిమా కుటుంబ నియంత్రణ పద్ధతులపై (Family Planning Practices) సమగ్రంగా ప్రసంగించి వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల సోషల్ సైన్సెస్ లెక్చరర్ రవిశంకర్, ఎం.పీ.హెచ్.ఈ.ఓ తాళ్లూరి వెంకటేశ్వర్లు, పీజీ విద్యార్థులు డా. మొహిద్దీన్, డా. అరివుక్కరసు, డా. రేష్మా, డా. జయప్రీతి, డా. సుదర్శన్, డా. హెప్సిబా, డా. ముబీనా, డా. జైరాం, డా. లక్ష్మీదేవితో పాటు ఇంటర్న్ వైద్యులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల ద్వారా కుటుంబ నియంత్రణ, ఆరోగ్యకరమైన కుటుంబ జీవనం, బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా యువతలో అవగాహన పెంపొందించడం ద్వారా సమాజంలో సుస్థిర అభివృద్ధికి దోహదపడే సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post