ప్రభుత్వ జనరల్ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం ప్రభుత్వ హాస్పిటల్ లోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.రోగులను ఆప్యాయంగా పలకరించి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.అదేవిధంగా అక్కడ డయాలసిస్,థైరాయిడ్ పరీక్ష కోసం తీసుకువచ్చిన మెషిన్ వంటివాటి గురించి ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.రోగులకు అందిస్తున్న మెనూ,మందుల స్టాక్ రూములను పరిశీలించారు.
