కూటమి ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తోంది మంత్రి డా,,డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.



 కూటమి ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తోంది

మంత్రి డా,,డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జరుగుమల్లి జూలై 11: 

కూటమి ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాయ్స్ & గర్ల్స్ టెన్ని-కాయిట్ ఛాంపియన్‌షిప్ పోటీలకు శనివారం ముఖ్య అతిథిగా మంత్రి డిఎస్ బీవీ స్వామి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తోంది. క్రీడలు మానసిక ఆరోగ్యానికి శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయి. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం. పాఠశాలల్లోనూ స్పోర్ట్స్ మీట్ కు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం గల క్రీడాకారుల్ని వెలికి తీసి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. జరుగుమల్లి జడ్పీ పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న పాఠశాల పూర్వ విద్యార్థులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post