₹68 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించిన మంత్రులు ఎస్.సవిత, డోలా బాల వీరాంజనేయస్వామి.




 ₹68 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించిన మంత్రులు ఎస్.సవిత, డోలా బాల వీరాంజనేయస్వామి.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ. పాత సింగరాయకొండ లో 12 లక్షలతో ఎస్టీ కాలనీ మంచినీటి పైపులైన్ పనులకు శంకుస్థాపన

​₹45 కోట్లతో సింగరాయకొండకు బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు: మంత్రి సవిత.

​ అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లు: మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.

కొండేపి నియోజకవర్గం, పాత సింగరాయకొండలో రూ. 68 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి గారలు కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ. 12 లక్షల అంచనా వ్యయంతో ఎస్టీ కాలనీకి మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా.శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావించి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

కొండేపి నియోజకవర్గంలో రూ. 500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

​ 2018 లోనే

సింగరాయకొండకు బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను తీసుకువస్తే, గత ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందని మండిపడ్డారు. మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ విజ్ఞప్తి మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు రూ. 45 కోట్లతో ఈ పాఠశాలను శాంక్షన్ చేశారని తెలిపారు.

​దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పెన్షన్లు అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, 'అన్నదాత సుఖీభవ' కింద పెట్టుబడి సాయంగా ఏటా రూ. 20 వేలు అందిస్తున్నామని చెప్పారు.

'తల్లికి వందనం' కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తలా రూ. 13 వేలు అందిస్తున్నామన్నారు. 'స్త్రీ శక్తి', 'దివ్యాంగ శక్తి' పథకాల ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, ఎస్సీ, ఎస్టీల గృహాలపై సోలార్ సిస్టమ్స్ బిగిస్తున్నామని వివరించారు.

​రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేల వరకు నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పారు.

​గత ప్రభుత్వం పాలనను గాలికి వదిలేస్తే, తాము గ్రామ స్థాయి నుండి వ్యవస్థలను పునరుద్ధరించి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.గత ప్రభుత్వం నిలిపివేసిన సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు ప్రభుత్వం రూ. 45 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో మొదటి ఫేజ్ కింద రూ. 20 కోట్లు విడుదల చేశామని ప్రకటించారు. అదేవిధంగా కనిగిరిలో కూడా రూ. 45 కోట్లతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసి, మొదటి ఫేజ్‌లో రూ. 20 కోట్లు కేటాయించామన్నారు.​నాణ్యమైన విద్య, వసతులతో కూడిన గురుకుల పాఠశాలలను పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు. కొండేపి అభివృద్ధికి శ్రమిస్తున్న మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి నియోజకవర్గ ప్రజలు తోడుగా ఉండాలని కోరారు.

​కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి మాట్లాడుతూ, విద్యతోనే పేదరికాన్ని దూరం చేయవచ్చనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రజాపక్షపాత ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.

​టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం పరితపిస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీరుస్తూనే, ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగెత్తిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కచ్చితంగా బీసీ రెసిడెన్షియల్ పాఠశాల లేదా కాలేజీ ఉండేలా చూడాలని మంత్రి సవిత గారిని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post