గిద్దలూరు మున్సిపాలిటీకి జిల్లాలో మొదటి స్థాన.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా
గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన సర్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపాలిటీ జిల్లాలోనే మొదటి స్థానాన్ని సాధించింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30,706 మంది ఓటర్లకు గాను 100 శాతం ఎన్యుమరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ ఘనత సాధించడంలో బూత్ లెవల్ అధికారులు (BLOలు), మున్సిపల్ సిబ్బంది, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లాలో 100 శాతం ఎన్యుమరేషన్ పూర్తి చేసిన మున్సిపాలిటీగా గిద్దలూరు నిలవడం విశేషం.
