శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రుల ప్రత్యేక పూజలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు..
ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సోమవారం దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. వేద పండితులు మంత్రులకు ఆశీర్వచనాలు అందించి, స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

