​వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.


 ​వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

​ముమ్మరంగా అప్రోచ్ రోడ్లు, తాగునీరు, విద్యుద్దీకరణ పనులు చేపట్టాలి. 

​జాయింట్ కలెక్టర్, అధికారులతో కలిసి వేములకోట, దేవరాజుగట్టు తదితర కాలనీల్లో విస్తృత తనిఖీలు. 

​మార్కాపురం, వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీల్లో ముంపు నిర్వాసితులకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతుల కల్పనను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

​శనివారం రోజున మార్కాపురం, పెద్దారవీడు మండలాల పరిధిలోని వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీలైన దేవరాజుగట్టు, వేములకోట, తోకపల్లి, ఇడుపూర్ - 1, 2 లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతుల పురోగతిని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి మరియు వెలుగొండ ప్రాజెక్టు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు.

​ఈ సందర్భంగా కాలనీల లేఅవుట్లను, పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన పిదప జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...

​ప్రాధాన్యత ప్రాతిపదికన పనులు: పునరావాస కాలనీలకు వెళ్లే అప్రోచ్ రోడ్లు, తాగునీటి సరఫరా మరియు విద్యుత్ సౌకర్యాల ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని స్పష్టం చేశారు.

​జంగిల్ క్లియరెన్స్, లెవెలింగ్: ఇంకా జంగిల్ క్లియరెన్స్ పూర్తికాని కాలనీలలో తక్షణమే పొదలను తొలగించి, భూమిని సమాంతరంగా (లెవెలింగ్) మార్చే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

​నాణ్యతా ప్రమాణాలు: నిర్వాసితులకు కల్పిస్తున్న మౌలిక వసతులలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్దేశిత సమయానికి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

​ఈ తనిఖీలో వెలుగొండ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post