కందులాపురం సెంటర్లో ఆక్రమణ తొలగించిన రెవిన్యూ, పోలీస్, హైవే సిబ్బంది.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు
మార్కాపురం జిల్లా కందులాపురం సెంటర్ నందు వివిధ షాప్ ల వారు రోడ్డు డ్రైనేజీలను ఆక్రమించడంతో ఎన్నో ప్రమాదాలు జరిగిన కారణంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత ఆదేశాల మేరకు ఈరోజు రెవిన్యూ కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మల్లికార్జున్ స్థానిక ఎస్సై శివ కృష్ణారెడ్డి పోలీస్ సిబ్బంది. హైవే సిబ్బంది ఎంపీడీవో వీరభద్రా చారి పంచాయతీ సిబ్బంది ఉమ్మడిగా ఆక్రమించిన షాపులను తొలగించారు.
కంభం మండల తాసిల్దార్ వి కిరణ్ మాట్లాడుతూ ఎవరైతే రోడ్డుకు దగ్గర కానీ డ్రైనేజ్ మీద బంకులు పెట్టడం కానీ ఉంటే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


