భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములు, ఎర్ర కాలువ మిగులు భూములు వెంటనే కేటాయించాలి – సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్.


 భూమిలేని పేదలకు ప్రభుత్వ భూములు, ఎర్ర కాలువ మిగులు భూములు వెంటనే కేటాయించాలి – సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్.

జంగారెడ్డిగూడెం, జులై 13,క్రైమ్ 9మీడియా ప్రతినిధి శరత్.

ఎన్నో సంవత్సరాలుగా భూమిలేక జీవనోపాధి కోసం ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ భూములను గుర్తించి కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో వేలాది మంది వ్యవసాయ కూలీలు, నిరుపేద కుటుంబాలు సాగు చేసుకోవడానికి సెంటు భూమి కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ భూములు, మిగులు భూములు, సాగుకు అనువైన భూములు కొందరు ప్రభావశీలుల చేతుల్లోకి వెళ్లడం ఆందోళన కలిగించే విషయమన్నారు.

భూమిలేని పేద కుటుంబాలను గుర్తించి, వారికి సాగు చేసుకునేందుకు మరియు జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వ భూములను పారదర్శకంగా కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించి, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పేదల జీవన హక్కులను పరిరక్షించే దిశగా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, భూమిలేని ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు ప్రభుత్వాన్ని కోరారు.

 లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని పేదలకు అండగా నిలుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ జి సూర్య కిరణ్ మండల కమిటీ సభ్యులు పఠాన్ మస్తాన్ యాగంటి సీత ఏ ప్రభాకర్ రావు బొక్క వెంకటేశు తదితరులు పాల్గొన్నారు


 సిపిఎం పార్టీ మండల కమిటీ జంగారెడ్డిగూడెం


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post