ఆర్ఓబీ నిర్వాసితులకు భూ పట్టాల పంపిణీ.
98 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.
పలాస, జూలై 14: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణం కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు భూ పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం పలాసలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష ముఖ్య అతిథిగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు భూ పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా నెమలి నారాయణపురం సర్వే నంబర్–346, పురుషోత్తపురం సర్వే నంబర్–51 పరిధిలోని భూములకు సంబంధించి మొత్తం 98 మంది నిర్వాసిత కుటుంబాలకు భూ పట్టాలు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేపట్టే అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు వారి జీవనోపాధికి భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.
కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, ఏఎంసీ చైర్మన్ మల్ల శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విఠల్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లోడగల కామేష్, మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు, కార్యదర్శి, పార్టీ నాయకులు, ఆర్డీవో, తహసీల్దార్ (ఎమ్మార్వో), నిర్వాసిత కుటుంబాల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


