ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులతో డి.ఎస్.పి. యు. నాగరాజ్ సమావేశం .



 ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులతో డి.ఎస్.పి. యు. నాగరాజ్ సమావేశం .

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు , ఆధ్వర్యంలో, మార్కాపురం సీఐ ఎం.డి. అల్తాఫ్ హుస్సేన్, వై.పాలెం సీఐ అజయ్ బాబు, మార్కాపురం ఎస్‌ఐతో కలిసి ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపుల యజమానులతో సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా డి య పి మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే, పదాలు శాంతిభద్రతలకు భంగం కలిగించే రెచ్చగొట్టే ఫ్లెక్సీలను ముద్రించవద్దని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇటువంటి ఫ్లెక్సీలను ముద్రించినా లేదా సరఫరా చేసినా సంబంధిత వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామనిఅయన ఫ్లెక్సీ ప్రింటింగ్ వారిని హెచ్చరించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post