ప్రైవేట్ పాఠశాలల బస్సులను తనిఖీలు నిర్వహించిన పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
జిల్లా ఎస్‌పి ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో కంభం ఎస్‌ఐ శివ కృష్ణ రెడ్డి మరియు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) కె ఎల్ రావు సంయుక్తంగా విద్యార్థుల రవాణాకు వినియోగిస్తున్న పాఠశాల మరియు కళాశాల బస్సులను తనిఖీ నిర్వహించారు
ఈ సందర్భంగా బస్సుల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, బీమా, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర వాహన రికార్డులు మరియు బస్సుల సాంకేతిక పరిస్థితిని పరిశీలించారు.
విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బస్సులను పూర్తిగా రోడ్డు యోగ్యమైన స్థితిలో నిర్వహించాలని, అతివేగంగా నడపకూడదని, సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదని, అన్ని ట్రాఫిక్ నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని పాఠశాల, కళాశాల యాజమాన్యాలు మరియు డ్రైవర్లకు అధికారులు సూచించారు.
విద్యార్థుల సురక్షిత రవాణా విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోదని అధికారులు హెచ్చరించారు.

