లయన్స్ క్లబ్ నూతన సారథిగా నంబాళ్ల కోదండరామయ్య.



లయన్స్ క్లబ్ నూతన సారథిగా నంబాళ్ల కోదండరామయ్య.

సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తాం: కోదండరామయ్య.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జూలై 20:

పలాస–కాశీబుగ్గ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నంబాళ్ల కోదండరామయ్య ఆదివారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. పలాసలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

ఈ సందర్భంగా ముందుగా దివంగత మాజీ ఎంపీ, లయన్స్ క్లబ్ వ్యవస్థాపక ప్రముఖుడు డాక్టర్ కణితి విశ్వనాథం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నూతన అధ్యక్షుడు నంబాళ్ల కోదండరామయ్య మాట్లాడుతూ, పలాస–కాశీబుగ్గ లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేస్తూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, విద్యా సహాయం, అవసరార్థులకు చేయూత, సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ ఎన్. శ్రీనివాసరావు హాజరయ్యారు. పీఎంజేఎఫ్ జిల్లా వైస్ గవర్నర్ కె.వి. రావు ఇన్‌స్టాలేషన్ ఆఫీసర్‌గా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ సమాజ హిత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. పూర్వ కార్యవర్గం అందించిన సేవలను అభినందిస్తూ, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, మాజీ అధ్యక్షులు, వివిధ ప్రాంతాల లయన్స్ ప్రతినిధులు, ప్రముఖులు, సేవా కార్యక్రమాల అభిమానం కలిగిన పలువురు పాల్గొన్నారు.
 

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post