2026 - 2027 లో తల్లికి వందనం లో నిర్లక్ష్యం .
. కూటమి ప్రభుత్వ పనితీరుకు తూట్లు పొడుస్తున్న మున్సిపల్ ఉద్యోగులు.
. జీతాలు తీసుకోవడం పై ఉన్న శ్రద్ధ... చేసే పనిలో మాత్రం పనితనం శూన్యం.
. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో గల స్వర్ణ వార్డు బాబు శెట్టి వారి పేట సచివాలయం సిబ్బంది నిర్వాకం.
. స్థానిక స్వర్ణ వార్డు బావి శెట్టి వారి పేట(21075061) సచివాలయ సిబ్బంది తప్పుడు నివేదిక వలన తల్లికి వందనం పొందలేని బాధితురాలు.
. అద్దె ఇంటిలో నివసిస్తున్న వారి పేరున 1,276.9 చదరపు గజాలలో అర్బన్ ఏరియాలో సొంత ఇల్లు ఉందని తప్పుడు నివేదిక సమర్పించిన సచివాలయ సిబ్బంది.
. తమకు తల్లికి వందనం రాకపోయినా పర్వాలేదు కానీ ప్రభుత్వ అధికారుల రికార్డు ప్రకారం మా పేరున చూపిస్తున్న 1,276.9 గజముల్లో గల ఇంటిని తమకు ఇప్పించవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ వారిని వేడుకుంటున్న బాధితులు.





