మాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
ఏపి మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ గౌరవ చైర్మన్ డా.పెదపూడి విజయ కుమార్, మాలసంఘ నాయకులు, ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.
ఏలూరు, జూలై 21క్రైమ్ 9 మీడియా ప్రతినిధి:- సన్నీ చక్రవర్తి :
స్థానిక గిరిజన భవనంలో మంగళవారం ప్రజాధర్భార్ నిర్వహించి మాలసంఘ నాయకులు, ప్రజలు నుండి ఏపి మాల సంక్షేమసహకార ఆర్థిక సంస్థ చైర్మన్ డా.పెదపూడి విజయ కుమార్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ మాలసంఘాలు నాయకులు, ప్రజలు సమస్యలను నేరుగా తెలియజేశారు. కొంత మంది అర్జీలను ఇచ్చారు. ముందుగా డాక్టరు బి.ఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలాలు వేసి, ఘననివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏపి మాల సంక్షేమసహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పెదపూడి విజయ కుమార్ మాట్లాడుతూ మాలలు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ తమ సమస్యలను, ఇబ్బందులు ధైర్యంగా చెప్పుకోవచ్చునని అన్నారు. మాలవర్గాలు సంక్షేమం, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని హామీ ఇచ్చారు. మాల సంఘాలు ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సంక్షేమ పథకాలు అమలు,ఉపాధి, విద్య,గృహాలు, రుణ సదుపాయాలు, పురపాలక, నగరపాలక షాపింగు కాంప్లెక్స్ లో రిజర్వేషన్లు అమలు, తదితర అంశాలుపై వినతి పత్రాలను అందజేశారని పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని అన్నారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తామని, మాలవర్గాలు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే కమీషన్ నిరంతరం పర్యవేక్షించి అర్హులకు అందేలా చూస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, ఏపి మాల సంక్షేమ సహకార ఆర్థిక సంస్థ డైరెక్టరు దాసరి ఆంజనేయులు, కృష్ణాజిల్లా డైరెక్టరు దయాల రాజేశ్వర రావు, జిల్లా బిజెపి అధ్యక్షులు సి.హెచ్.విక్రమ్ కిషోర్, గోపాలపురం జనసేన పార్టీ ఇన్చార్జి దొడ్డికర్ల సువర్ణరాజు,వివిధ ఎస్సీ ప్రజాప్రతినిధులు, సంఘాలు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



