పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి కలెక్టర్ పిలుపు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
ముండ్లకూరు, తేది.5.6.2026. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన "అనంత అరణ్య" కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గం, ముండ్లమూరు మండల కేంద్రంలోని పిఎం ఏపి మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజి అవరణలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మొక్కలు నాటడంతో పాటు మొక్కలు నాటేందుకు వీలుగా గుంతలు తవ్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటం కోసం, పచ్చదనం పెంపొందేలా, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపు మరియు విద్యార్థులకు ఆరోగ్యకరమైన, హరిత వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో నెట్ జీరో హెల్త్ క్యాంపస్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, అటవీ శాఖ మరియు సంబంధిత విద్యా శాఖల సమన్వయంతో ప్రభుత్వ నివాస పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్ ప్రాంగణాలలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల ప్రాంగణాలను పచ్చదనంతో నింపడంతో పాటు విద్యార్థులలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 0.25 ఎకరాల విస్తీర్ణంలో 1,625 మొక్కలతో అల్ట్రా హైడెన్సిటీ ప్లాంటేషన్ ఏర్పాటు తో పాటు మొక్కలను ఏడు పొరల పద్ధతిలో నాటడం ద్వారా తక్కువ స్థలంలో ఎక్కువ పచ్చదనాన్ని అభివృద్ధి చేయుటకు వీలుకలుగుతుందని కలెక్టర్ వివరించారు. జిల్లాలో మొత్తం 13 ప్రభుత్వ నివాస పాఠశాలలు మరియు హాస్టళ్లలో ఈ కార్యక్రమం అమలు చేయడం జరుచున్నదన్నారు. ఇందుకోసం సుమారు 21,125 మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం అమలు వలన విద్యాసంస్థల ప్రాంగణాలలో హరిత వాతావరణం అభివృద్ధి చెందడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు మెరుగుపడుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు. అలాగే కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు దోహదం పడటం, జీవ వైవిధ్య సంరక్షణకు ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు పర్యావరణ అనుకూలమైన విద్యా క్యాంపస్ లను అందించడంలో ఈ కార్యక్రమం ఎంతో దోహపడుతుందన్నారు.
దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డా గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతు, ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జారుగుచున్నదన్నారు. పరిసరాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మన పరిసరాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యమైన జీవనం సాగించేందుకు వీలౌతుందన్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించండం అలవర్చుకోవాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా ఆ మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకున్నప్పుడే మొక్కలు నాటే కార్యక్రమానికి సార్థకత కలుగుతుందన్నారు.
ఈ సందర్భంగా అందరిచే ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి శ్రీమతి రేణుక, డ్వామా పిడి జోసెఫ్ కుమార్, అద్దంకి డివిజన్ ఎపిడి రవి కుమార్, మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
.jpeg)

