మహిళా ఆరోగ్య కార్యకర్తల సమీక్ష సమావేశం ఆరోగ్యశాఖ అధికారి.


 మహిళా ఆరోగ్య కార్యకర్తల సమీక్ష సమావేశం ఆరోగ్యశాఖ అధికారి.

 ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలములో మహిళా ఆరోగ్య కార్యకర్తలకు మాతాశిశు సంక్షేమ సేవలపై సమీక్షాసమావేశము నిర్వహించారు 

 ఈ సందర్భముగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి  డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి మహిళా ఆరోగ్య కార్యకర్త మాతాశిశు సంక్షేమ సేవలపై వారికీ కేటాయించిన లక్ష్యాములను ప్రతి నెల సాదించాలని తెలిపినారు.

ముఖ్యముగా గర్భిణీస్త్రీలను వీలైనంత తొదరగా 12 వారములలోపు గుర్తించి వారిని వెంటనే రిజిస్టర్ చేసి వారికీ అందించవలసిన సేవలన్నిటిని సకాలములో అందించాలని ఆదేశించారు. అలా లక్ష్యం చేరని  మహిళా ఆరోగ్య కార్యకర్తలకు తగు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు . గర్భిణీస్త్రీలను వీలైనంత తొదరగా 12 వారములలోపు గుర్తించి వారిని రిజిస్టర్ చేసినందు వలన భవిషత్ లో మాతృ మరణాలు శిశు మరణాలు నివారించవచ్చని తెలిపారు.

 ప్రతి గర్భిణీస్త్రీ కి ఆబ ననెంబర్ ను కేటాయించవలసినదిగా తెలిపారు.

 ఆరోగ్య కార్యక్తలు ప్రజలకు అందించిన సేవలన్నిటిని అందుకు సంబందించిన యాప్ లలో ప్రతీ రోజు ఆప్ లోడ్ చేయవలసినదిగా తెలియజేశారు

ఈ సమావేశములో డాక్టర్ రమేష్ ఒంగోలు ఉప  జిల్లా  వైద్య ఆరోగ్యశాఖ అధికారి . డాక్టర్ కమలశ్రీ  వ్యాధి నిరోధిక టీకాల అధికారి డాక్టర్ శ్రావణ్  ఫిక్సడ్ డాక్టర్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నబి మాస్ మీడియా అధికారి నరసింహారావు మొదలగు వారు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు .

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post