మందుబాబులకు అడ్డగా మారిన డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయం.




 మందుబాబులకు  అడ్డగా మారిన డివిజనల్  విద్యుత్ శాఖ కార్యాలయం. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కాపురం డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయ ఆవరణలో మందుబాబులకు అడ్డాగా మారిందని కరెంటు బిల్లు కట్టే ప్రజలు ముక్కువేలేసుకుంటున్నారు. అయితే చుట్టు విద్యుత్ కార్యాలయాలు ఉన్నా. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు తాగుతున్నారా? మరి బయటివారు వచ్చి తాగుతున్నారా? అనే విషయము  అర్థం కాకపోవటంతో బిల్లు కట్టడానికి వచ్చే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యాలయం ఎదురు గా ద్విచక్ర వాహనాలు ట్రాక్టర్లు దగ్గర శుభ్రత లేకుండా బీరు సీసాలు క్వార్టర్ బాటిల్లు దర్శనమిస్తున్న అధికారులు పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

ఇప్పటికైనా డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు మార్కాపురం జిల్లా కు నూతనంగా వచ్చిన యస్ సి గారు డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయ ఆవరణలో మందుబాబులకు అడ్డగా మారిన స్థలాన్ని పరిశీలించి స్పందిస్తారో లేదో వేచి చూడాలి మరి.?

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post