Dr బి ఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవoలో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మార్కాపురం జిల్లా కనిగిరి ఒంగోలు బస్టాండ్ ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ మహోత్సవానికి కేంద్ర ఆహార శుద్ధి మరియు పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ , మరియు హోమ్ శాఖ, విపత్తు శాఖ మంత్రి వర్యులు గౌ " శ్రీమతి వంగలపూడి అనిత గారు ముఖ్య అతిథులుగా హాజరు అయినారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి , కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొననున్నారు.
అనంతరం అంబేద్కర్ గారి జీవిత చరిత్ర, ఆశయాలు, సిద్ధాంతాలు , విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మనం అందరూ ఆయన ఆశయాలు సిద్ధాంతాలు మన అందరికీ స్పూర్తి అని యువత అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ముందుకు సాగాలని యూనియన్ మినిస్టర్ పాశ్వాన్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి అంబేద్కర్ అభిమానులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, యువత మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


